- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు వేగవంతం
<p>దిశ, ఏపీ బ్యూరో: రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి రైతులకు వ్యవసాయ, అనుబంధ సేవలు అందించడమే లక్ష్యమని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. పలు జిల్లాల జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్లు, సంబంధిత అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, సీడ్స్ ఎండీ శేఖర్ బాబు, ఆగ్రోస్ ఎండీ బాలాజీ పాల్గొన్నారు. జిల్లాల వారీగా […]</p>

దిశ, ఏపీ బ్యూరో: రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి రైతులకు వ్యవసాయ, అనుబంధ సేవలు అందించడమే లక్ష్యమని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. పలు జిల్లాల జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్లు, సంబంధిత అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, సీడ్స్ ఎండీ శేఖర్ బాబు, ఆగ్రోస్ ఎండీ బాలాజీ పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఎరువులు, విత్తనాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలపై మంత్రి ఆరా తీశారు.
నెల్లూరు జిల్లాలో పంట ఉత్పత్తుల కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను కన్నబాబు ఆదేశించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో సానుకూలంగా స్పందించాలని సూచించారు. కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు నిర్ణీత సమయంలో పూర్తి చేయడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.






