- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలకలం రేపుతున్న సర్వేయర్ ఇంట్లో ఏసీబీ దాడులు…
<p>దిశ, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సర్వేయర్ పావని ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న పావని వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో నివాసం ఉంటోంది. ఇటీవలే మండలంలో నిర్వహించాల్సిన భూ సర్వే కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో చిట్యాల తహసీల్దార్ ఆఫీస్ లో విధులు నిర్వహించిన ఇద్దరు ఎమ్మార్వోలు, డిప్యూటీ తహసీల్దార్, వీఆర్వోలు ఏసీబీకి […]</p>

X
దిశ, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సర్వేయర్ పావని ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న పావని వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో నివాసం ఉంటోంది. ఇటీవలే మండలంలో నిర్వహించాల్సిన భూ సర్వే కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో చిట్యాల తహసీల్దార్ ఆఫీస్ లో విధులు నిర్వహించిన ఇద్దరు ఎమ్మార్వోలు, డిప్యూటీ తహసీల్దార్, వీఆర్వోలు ఏసీబీకి పట్టుబడ్డారు. తాజాగా మరో అధికారి పావని ఇంట్లో సోదాలు నిర్వహించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. దీనిపై పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించాల్సి ఉంది.
Next Story






