- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏబీవీపీ వినూత్న నిరసన..వినాయకుడికి వినతిపత్రం
హుజురాబాద్‌లో ఏబీవీపీ వినూత్న నిరసన తెలిపింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని కాకతీయ

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్‌లో ఏబీవీపీ వినూత్న నిరసన తెలిపింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని కాకతీయ కాలనీలోని వినాయకుడికి వినతిపత్రాన్ని సమర్పించారు హుజురాబాద్‌లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ....రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన రూ. 8,300 కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయడంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు.
సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు లేవని, విద్యార్థులు ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మెస్,సి కాస్మొటిక్ ఛార్జీలు పెంచకపోవడం వల్ల నాణ్యమైన భోజనం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, దీనివల్ల విద్యార్థులే చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు తరచుగా జరుగుతున్నాయని ఆరోపించారు. సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల కొన్ని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు మూతపడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు అజయ్, అంజి, శ్రీకాంత్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.






