‘సునీల్ నాయక్‌ది ఆత్మహత్య కాదు.. హత్య’

by  |
ABVP leaders
X

దిశ, కుత్బుల్లాపూర్: విద్యార్థుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో నిరుద్యోగులు దారుణమైన పరిస్థితుల్లో మగ్గుతున్నారని, నూతర రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడిచిన నోటిఫికేషన్ ఇవ్వకుండా టీఆర్ఎస్ సర్కార్ కాలయాపన చేస్తోందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు షణ్ముఖ్ అన్నారు. శనివారం ఏబీవీపీ చింతల్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా షణ్ముఖ్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు. ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన విద్యార్థులకు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి బోడ సునీల్ నాయక్‌ది ఆత్మహత్య కాదని, అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని అన్నారు. వెంటనే ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా సునీల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.


Next Story

Most Viewed