విధుల్లోకి రాకుంటే ప్రభుత్వోద్యోగుల్ని తొలగిస్తాం

by  |
విధుల్లోకి రాకుంటే ప్రభుత్వోద్యోగుల్ని తొలగిస్తాం
X

న్యూఢిల్లీ : కరోనావైరస్‌పై పోరాడేందుకు సర్కారు సిద్ధమవుతుండగా.. కొందరు ఉద్యోగులు విధులకు హాజరుకాకుండా ఇంటిపట్టుకే ఉండిపోతున్నారు. దీనిపై సీరియస్ అయిన.. వినియోగదారుల వ్యవహారాలు మరియు ఆహార పంపిణీ మంత్రిత్వ శాఖ వారందరి వేటు వేయబోతున్నట్టు హెచ్చరికలు జారీ చేసింది. కరోనా పోరాటంలో కీలకంగా ఉన్న ఈ మంత్రిత్వ శాఖ.. విధుల్లోకి ఎవరెవరు రావాలనుకుంటున్నారు? లేదా ఇంటికి పరిమితం కావాలనుకుంటున్నారో? ఈ నెల 20లోపు తెలపాలని ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరిని ఓ మెమోరాండంలో కోరింది. దీనితో ఎవరెవరిని విధుల్లో నుంచి తొలగించాలో నిర్ణయిస్తామని అందులో హెచ్చరించింది. రామ్ విలాస్ పాశ్వాన్ మంత్రిగా ఉన్న ఈ శాఖ పై హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఇతర కేంద్రమంత్రిత్వ శాఖలు కూడా ఇటువంటి ఆదేశాలనే జారీ చేశాయా? అనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు.

Tags: sack, central ministry, consumer affairs, food and public distribution, ram vilas paswan, employee, absentees



Next Story

Most Viewed