- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో సీక్రెట్స్ కోసం గాసిప్ సైట్‌లోకి తండ్రి వెళ్లి..
<p>దిశ, సినిమా: బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్, దివంగత నటుడు రిషి కపూర్ ‘ఢిల్లీ 6, ఆల్ ఈజ్ వెల్’ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ‘ది బిగ్ బుల్’ ప్రమోషన్స్‌లో ఉన్న జూనియర్ బచ్చన్ తాజా ఇంటర్వ్యూలో లెజెండరీ యాక్టర్‌తో ఉన్న ఓ ఎక్స్‌పిరియన్స్ పంచుకున్నారు. సిమ్లాలో సినిమా షూటింగ్ కోసం వెళ్లిన తాము హోటల్‌లో స్టే చేశామని తెలిపారు. ఆ రోజు మార్నింగ్ కలిసి కాఫీ తాగేందుకు తన రూమ్‌కు వెళ్లానని, రిషి […]</p>

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్, దివంగత నటుడు రిషి కపూర్ ‘ఢిల్లీ 6, ఆల్ ఈజ్ వెల్’ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ‘ది బిగ్ బుల్’ ప్రమోషన్స్‌లో ఉన్న జూనియర్ బచ్చన్ తాజా ఇంటర్వ్యూలో లెజెండరీ యాక్టర్‌తో ఉన్న ఓ ఎక్స్‌పిరియన్స్ పంచుకున్నారు. సిమ్లాలో సినిమా షూటింగ్ కోసం వెళ్లిన తాము హోటల్‌లో స్టే చేశామని తెలిపారు.
ఆ రోజు మార్నింగ్ కలిసి కాఫీ తాగేందుకు తన రూమ్‌కు వెళ్లానని, రిషి జీ లుంగీ కట్టుకుని ల్యాప్ టాప్ ముందు కూర్చున్నాడని, ఆ విజువల్ చాలా క్యూట్‌గా అనిపించిందని చెప్పారు. ఏం చేస్తున్నారని అడిగితే.. కొడుకు రణ్‌బీర్ కపూర్ గురించి తెలుసుకునేందుకు గాసిప్ వెబ్‌సైట్ ఫాలో అవుతున్నానని తెలిపారని, అప్పటి వరకు తనకు ఆ సైట్ గురించి కూడా తెలియదన్నారు అభిషేక్. రణ్‌బీర్ గురించి ఇతరులకు ఎక్స్‌ప్లేన్ చేసేందుకు తనకున్న దారి ఇదొక్కటే అన్నారని, ఆ సమయంలో తనను చూస్తే చాలా స్వీట్‌గా అనిపించిందని తెలిపారు.






