అమితాబ్‌ కారణమంటావా? అభిషేక్‌పై అజయ్ దేవగన్ ఫైర్

60

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్ ‘బిగ్ బుల్’ ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ‘ద కపిల్ శర్మ’ షోకు హాజరయ్యారు. అజయ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలో అభిషేక్ స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా క్యారెక్టర్ ప్లే చేస్తుండగా.. ఇందుకు సంబంధించిన విషయాలను షేర్ చేశారు. దీంతో పాటు బచ్చన్ ఫ్యామిలీకి కరోనా వచ్చినప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు.

కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండనందుకు అజయ్ దేవగన్ తనపై ఫైర్ అయ్యారని తెలిపాడు అభిషేక్. ‘డాడీకి కాల్ చేసి హాస్పిటల్‌కు పిలిచిన డాక్టర్ పాజిటివ్ అని చెప్పారని, ఆ తర్వాత తనకు కూడా కరోనా వచ్చినట్లు రిజల్ట్ వచ్చిందన్న అభిషేక్.. ఆ సమయంలో ఫ్యామిలీ గురించి చాలా వర్రీ అయిపోయానని తెలిపాడు. అప్పుడు అజయ్ కాల్ చేసి తనను కోప్పడ్డారని.. ఆ టైమ్‌లో తన కాల్ లిఫ్ట్ చేసేందుకు రిగ్రీట్‌గా ఫీల్ అయ్యానని చెప్పాడు. అయితే అభిషేక్‌పై ఫైర్ అయ్యేందుకు అసలు కారణం అది కాదని చెప్పాడు అజయ్. కరోనా పాజిటివ్ వచ్చేందుకు కారణం అమితాబ్ అని బ్లేమ్ చేయడంతోనే అభిషేక్‌పై ఆగ్రహంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..