డేటింగ్‌లో సీరియల్ స్టార్స్.. ఇలా దొరికిపోయారు!

by  |
డేటింగ్‌లో సీరియల్ స్టార్స్.. ఇలా దొరికిపోయారు!
X

దిశ, సినిమా: ‘ఆమె కథ’ సీరియల్ స్టార్స్ రవి కృష్ణ, నవ్య స్వామి డేటింగ్‌లో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు పలు బుల్లితెర కార్యక్రమాలకు వీరిద్దరూ జంటగా హాజరుకావడం, ప్రపోజ్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చూశాం. ఇది కేవలం రీల్ వరకు మాత్రమే అనుకున్నా.. రియల్ లైఫ్‌లోనూ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ నడుస్తోందని టాక్. చాలా కాలంగా లవ్‌లో ఉన్న ఈ సీరియల్ స్టార్స్ లేటెస్ట్‌గా మల్లెమాల నిర్మిస్తున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోకు గెస్ట్‌లుగా హాజరై రూమర్స్‌ నిజమేనంటూ స్ట్రాంగ్ హింట్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఒకరికి ఒకరు లవ్ యూ చెప్పుకోవడం, ఆ తర్వాత పెళ్లి తంతు కూడా జరిగిపోవడం చూసిన ఆడియన్స్.. నిజంగానే వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని కన్‌ఫర్మ్ చేసేశారని అంటున్నారు. పైగా వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ గురించి ఎన్నిసార్లు గుసగుసలు వినిపించినా ఖండించకపోవడం.. ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇక ‘స్టార్ మా’లో ప్రసారం అవుతున్న ‘100% లవ్’ కార్యక్రమంలోనూ ఈ జంట తమ స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆడియన్స్‌కు కనులవిందు చేయడం విశేషం.


Next Story

Most Viewed