బాయ్ ఫ్రెండ్‌తో ముద్దుల్లో మునిగిన స్టార్ డైరెక్టర్ కూతురు..

by  |
బాయ్ ఫ్రెండ్‌తో ముద్దుల్లో మునిగిన స్టార్ డైరెక్టర్ కూతురు..
X

దిశ, సినిమా: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ ప్రస్తుతం తన ప్రియుడు షేన్ గ్రెగోయిర్‌తో కలిసి విహారయాత్రలో ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన ఆలియా.. బాయ్‌ఫ్రెండ్‌తో పార్టీకి సంబంధించిన కొన్ని హాట్ ఫొటోస్ షేర్ చేసింది. మొదటి పిక్‌లో చేతిలో జ్యూస్ గ్లాసులతో బెడ్‌పై కూర్చుని ఒకరినొకరు చూసుకుంటుండగా.. మరో పిక్‌‌లో వీరిద్దరూ డీప్ లిప్ కిస్‌‌లో మునిగిపోయారు. ఈ ఫొటో షేర్ చేసిన ఆలియా.. ‘రొమాంటిక్ గేట్‌వే’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ కపుల్ పిక్స్‌పై స్పందించిన జాన్వీ కపూర్.. ‘ధ్యానం చేయండి’ అని కామెంట్ చేసింది.

ఇదిలా ఉంటే, ఇటీవలే తను లోదుస్తుల్లో చేసిన ఫొటో‌ షూట్‌పై బెదిరింపులు వచ్చాయన్న ఆలియా.. అలాంటి వాటికి తాను భయపడనంటూ ప్రియుడితో ప్రేమ వ్యవహారం గురించి వివరించింది. ‘మేమిద్దరం రెండు నెలలు మాట్లాడుకున్నాకే కలుసుకున్నాం. తను నన్ను చూడగానే ముద్దుపెట్టుకుంటాడని అనుకున్నా. కానీ అతడు అలా చేయకుండా, అందుకు నేను సుముఖంగా ఉన్నానా లేదో తెలుసుకున్నాకే ముద్దుపెట్టాడు. దాంతో అతనేంటో నేను పూర్తిగా అర్థం చేసుకోగలిగాను’ అంటూ వివరించింది.

నగ్నంగా ఫొటో షూట్ చేసిన యూనివర్సిటీ యువతీయువకులు



Next Story

Most Viewed