హెయిర్ కట్‌కు డబ్బులు డిమాండ్ చేస్తున్న ఆది!

by  |
హెయిర్ కట్‌కు డబ్బులు డిమాండ్ చేస్తున్న ఆది!
X

క్యారెక్టర్‌లో కంటెంట్ ఉంటే చాలు.. ఇట్టే కమిట్ అయిపోతాడు హీరో ‘ఆది పినిశెట్టి’. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. రోల్ ఏదైనా సరే, తన పాత్రలో వెయిటేజ్ ఉందా లేదా అని మాత్రమే ఆలోచిస్తూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు.

‘సరైనోడు’ చిత్రంలో విలన్‌గా, ‘నిన్నుకోరి’ సినిమాలో హీరోయిన్ భర్తగా, ‘రంగస్థలం’లో అశోక్ బాబుగా తెరపై మెప్పించిన ఈ హీరో.. ఇప్పుడు హెయిర్ కట్ చేయడంలోనూ శభాష్ అనిపించుకున్నాడు. లాక్‌డౌన్‌తో బయటికెళ్లి హెయిర్ కట్ చేసుకోవడం పాసిబుల్ కాకపోవడంతో తండ్రి రవిరాజా పినిశెట్టికి తనే హెయిర్ కట్ చేశాడు. అంతేకాదు చక్కగా సెట్ అయిందని అనుకున్న తర్వాత.. క్రాఫ్ చేసినందుకు గాను తండ్రి దగ్గర పైసలు వసూల్ చేశాడు. వాళ్ల నాన్న పర్స్‌లో నుంచి డబ్బులు తీసి ఇవ్వగా.. ఇవి సరిపోవు అంటూ పర్స్‌లో నుంచి పూర్తిగా డబ్బులు లాగేసుకున్నాడు ఆది. ఈ లవబుల్ అండ్ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పనేదో భలే ఉందే అంటున్న నెటిజన్లు.. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధానికి ఫిదా అయిపోయారు. లాక్‌డౌన్ లైఫ్‌లో మరో పాజిటివ్ వీడియో అని అభిప్రాయ పడుతున్నారు.

ఈ వీడియోపై స్పందించిన మంచు మనోజ్.. ఈ మధ్య కాలంలో ఇంత క్యూట్ వీడియోను చూడలేదని అన్నాడు. ‘నా స్వీట్ ఫ్యామిలీ’ అంటూ మురిసిపోయాడు. కాగా పినిశెట్టి ఫ్యామిలీ, మంచు కుటుంబానికి మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed