‘ఇదేంటని అడిగితే.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటున్నాడు’

76
aadhar-11

దిశ, టేకులపల్లి: టేకులపల్లి మండలంలోని ఆధార్ నమోదు సెంటర్ ఉండికుడా లేనట్లే ఉందని టేకులపల్లి మండల ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ బానోత్ సరిలాల్ చెప్పారు. ఈ మేరకు గురువారం సరిలాల్ విలేకరులతో మాట్లాడుతూ.. టేకులపల్లి మండల ప్రజలు కొత్తగూడెం, ఇల్లందు వెళ్లి ఆధార్ మొబైల్ నెంబర్, తప్పుఒప్పులను సరిచేసుకోవాల్సి వస్తుందన్నారు. ఇదేంటని స్థానిక ఆధార్ నమోదు సెంటర్ నిర్వాహకుడిని అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటున్నాడని సరిలాల్ చెప్పారు. సంబంధిత అధికారులు వెంటనే స్థానికంగా ఉన్న మీ సేవా సెంటర్ పై చర్యలు తీసుకోవాలని, మండల ప్రజలకు సర్వీసులు అందేలా చూడాలని కోరారు.