పుష్ప డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్న ఏఏ..

by  |
Pushpa
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పాన్ ఇండియా రేంజ్‌లో నటిస్తున్న సినిమా పుష్ప. ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు వేయి కళ్ళతో వేచిచూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్, ఫస్ట్ లుక్ ఇలా ప్రతీ ఒక్కటి అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకి రానుండగా అభిమానుల మనసుల్లో మాత్రం కొన్ని సందేహాలు మెదులుతున్నాయి. పుష్ప ది రైజ్ విడుదలకు సన్నద్దం కానుండగా దీనిని ఏ భాషలో ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎట్టకేలకు దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది. ‘పుష్ప ది రైజ్’ డిస్ట్రిబ్యూట్ హక్కులను తమిళంలో లైకా ప్రొడక్షన్స్, కన్నడలో స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్, మళయాళంలో E4 ఎంటర్‌టైన్మెంట్స్ వారు సొంతం చేసుకున్నారు. ఇక హిందీ విషయానికి వస్తే బాహుబలి, కేజీఎఫ్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ‘ఏఏ ఫిల్మ్స్ ఇండియా’ తన ఖాతాలో ఇప్పుడు పుష్ప సినిమాను కూడా చేర్చుకుంది. దీంతో పుష్ప మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ విషయంలో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే స్పైడర్ మ్యాన్ సినిమాతో పోటీ చేసి పుష్ప నెగ్గుకొస్తుందా అన్న ప్రశ్నకు సమాధానం కోసం వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed