అంచనాలు పెంచేసిన టాలీవుడ్ ఫస్ట్ హాకీ ఫిల్మ్ ట్రైలర్

by  |
అంచనాలు పెంచేసిన టాలీవుడ్ ఫస్ట్ హాకీ ఫిల్మ్ ట్రైలర్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఫస్ట్ హాకీ ఫిల్మ్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ ట్రైలర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసింది. దేశంలో స్పోర్ట్స్ బిజినెస్‌గా మారిందనే కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమాలో సందీప్ కిషన్ హాకీ ప్లేయర్‌గా కనిపిస్తుండగా..గేమ్ స్కిల్స్‌తో అదరగొట్టేశాడు. సిక్స్ ప్యాక్ బాడీ, పవర్ ఫుల్ డైలాగ్స్‌తో నిండిపోయిన ట్రైలర్ ఆకట్టుకుంటుండగా.. ఆటను వ్యాపారంగా మార్చిన వారికి బుద్ధి చెప్పే స్టోరి లైన్‌తో వస్తున్న చిత్రం బాక్సాఫీస్ వద్ద తప్పకుండా సక్సెస్ అవుతుందనే అంటున్నారు ఫ్యాన్స్.

స్పోర్ట్స్ జోనర్‌లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు హిట్ కాగా, ఈ చిత్రం కూడా విజయవంతం అవుతుందని చెప్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకులు. హిప్ హాప్ తమిజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ కానుండగా…కెవిన్ రాజ్ విజువ‌ల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉండగా..వచ్చే నెల 26న సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిపారు మేకర్స్.


Next Story

Most Viewed