విన్నింగ్ మూమెంట్‌ను ఆస్వాదిస్తున్న సందీప్ కిషన్

64

దిశ, వెబ్‌‌డెస్క్: యంగ్ హీరో సందీప్ కిషన్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ ఫస్ట్ లుక్ రిలీజైంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న తొలి హాకీ బేస్డ్ మూవీ ఇదే కాగా.. ప్లేయర్‌గా సందీప్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. సూపర్ ఫిట్‌ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో కనిపిస్తున్న సందీప్.. ఒక చేతిలో హాకీ స్టిక్, మరో చేతిలో చొక్కాతో మ్యాచ్ విన్నింగ్ మూమెంట్‌ను ఆస్వాదిస్తున్న పిక్ అమేజింగ్‌గా ఉంది. సందీప్ కిషన్‌కు ఇది హీరోగా 25వ సినిమా కాగా.. తను కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను డైరెక్షన్‌లో వస్తున్న చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ సంయుక్తంగా నిర్మించగా.. హిప్‌హాప్ తమీజా సంగీతం అందించారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా వస్తున్న సినిమాలో రావు ర‌మేష్‌, మురళీ శ‌ర్మ, పోసాని కృష్ణముర‌ళి, ప్రియ‌ద‌ర్శి, స‌త్య, రాహుల్ రామ‌కృష్ణ ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు.