ఒక యువతి, 25 మంది యువకులు.. రాత్రంతా అడవిలో అత్యాచారం

250
young woman raped

దిశ, వెబ్‌డెస్క్ : ఫేస్ బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ఓ యువతి జీవితాన్ని బుగ్గిపాలు చేసింది. స్నేహితుడని వెంట వెళ్లిన ఆమెపై అతడు అత్యాచారం చేయడంతోపాటు తన స్నేహితులతో లైంగిక దాడి చేయించాడు. ఇలా 25 మంది యువకులు ఆమె జీవితంతో ఆడుకున్నారు.

హర్యానా రాష్ట్రంలోని పల్వాల్ జిల్లాకు చెందిన యువతికి ఇటీవల ఓ యువకుడు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. మొదట ఛాటింగ్ చేసుకున్న వారిద్దరు ఆ తర్వాత ఫోన్ నంబర్లు సేకరించుకుని ఇద్దరు మాట్లాడుకునే వారు. ఇలా వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. దీంతో ఆ యువకుడు ఆమెను తన ఏరియాలో ఉన్న రామ్ ఘడ్ అటవీ ప్రాంతాన్ని చూడడానికి రావాలని ఆహ్వానించాడు.

స్నేహితుడే కదా అని నమ్మిన ఆమె.. ఒక్కతే అతడి వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి రామ్ ఘడ్ అటవీ ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లిన యువకుడు సాయంత్రం సమయంలో లోపలికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన స్నేహితులను పిలిపించుకుని బలవంతంగా వారితో అత్యాచారం చేయించాడు. ఒకరినొకరు ఫ్రెండ్స్ అంటూనే 25 మంది యువకులు ఆమెను బంధించి రాత్రంతా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారు జామున అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతిని అటవీకి సమీపంలో వదిలి వెళ్లిపోయారు. అటుగా వెళ్లిన స్థానికులు జరిగిన దారుణాన్ని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని ఆస్పత్రిలో చేర్పించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ కేసుపై పోలీసులు అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి వివరాలను ప్రకటించక పోవడం గమనార్హం.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..