- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మత్తు ఇంజక్షన్ తీసుకొని సౌందర్య సూసైడ్
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: మత్తు ఇంజక్షన్ తీసుకొని యువతి సూసైడ్ చేసుకున్న సంఘటన సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా మర్రిగూడకు చెందిన సౌందర్య అనే 25ఏళ్ల యువతి సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మూడేళ్ల నుంచి నర్సుగా పనిచేస్తోంది. మంగళవారం ఫస్ట్ షిప్ట్ చేసి మధ్యాహ్నానికి హాస్టల్‌కు చేరుకున్న యువతి.. ఫ్రెండ్స్‌తో కలిసి లంచ్‌కు వెళ్లకుండా రూమ్‌లోనే ఉంది. రాత్రి 7గంటల వరకు కూడా యువతి గదిలోనే […]</p>

దిశ, క్రైమ్‌బ్యూరో: మత్తు ఇంజక్షన్ తీసుకొని యువతి సూసైడ్ చేసుకున్న సంఘటన సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా మర్రిగూడకు చెందిన సౌందర్య అనే 25ఏళ్ల యువతి సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మూడేళ్ల నుంచి నర్సుగా పనిచేస్తోంది. మంగళవారం ఫస్ట్ షిప్ట్ చేసి మధ్యాహ్నానికి హాస్టల్‌కు చేరుకున్న యువతి.. ఫ్రెండ్స్‌తో కలిసి లంచ్‌కు వెళ్లకుండా రూమ్‌లోనే ఉంది. రాత్రి 7గంటల వరకు కూడా యువతి గదిలోనే పడుకొని ఉండటంతో ఫ్రెండ్స్, సిబ్బంది గమనించగా… ఆమె పక్కనే మత్తు ఇంజక్షన్ ఉంది. యువతిని ఎంత పిలిచినా కదలికలు లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే యువతి ప్రాణాలు కోల్పోయింది. ఘటనాస్థలికి చేరుకొని యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.






