- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెండ్లి చేసుకున్న 15 రోజులకే వదిలేశాడు
<p>దిశ, వెబ్‌డెస్క్: భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. ప్రేమించి పెండ్లి చేసుకున్నపాపానికి కేవలం 15 రోజులే తనతో కాపురం చేసి మోహం చాటేశాడని వాపోయింది. స్వగ్రామానికి వెళ్లి వస్తానని చెప్పిన భర్త ఎంతకీ తిరిగి రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు బైఠాయించింది. వివరాళ్లోకి వెళితే.. కర్నూలు జిల్లా నందవరంకు చెందిన ఓ యువతి(19)కి హైదరాబాద్‌కు చెందిన రాకేశ్ గౌడ్(26) ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. […]</p>

దిశ, వెబ్‌డెస్క్: భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. ప్రేమించి పెండ్లి చేసుకున్నపాపానికి కేవలం 15 రోజులే తనతో కాపురం చేసి మోహం చాటేశాడని వాపోయింది. స్వగ్రామానికి వెళ్లి వస్తానని చెప్పిన భర్త ఎంతకీ తిరిగి రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు బైఠాయించింది.
వివరాళ్లోకి వెళితే.. కర్నూలు జిల్లా నందవరంకు చెందిన ఓ యువతి(19)కి హైదరాబాద్‌కు చెందిన రాకేశ్ గౌడ్(26) ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడూ కలుసుకునేవారు. అయితే, తనను పెండ్లి చేసుకొమ్మని ప్రియురాలు అడగడంతో ప్రియుడు కూడా అంగీకరించాడు. కాగా, వీరు పెద్దలకు తెలియకుండా పెండ్లి చేసుకున్నారు.
పెండ్లి అయిన తర్వాత వీరిద్దరూ జూన్ 4వ తేదీన హైదరాబాద్‌లోనే రూమ్ తీసుకొని ఉంటున్నారు. సరిగ్గా 15 రోజులు భార్యతో ఉన్న రాకేశ్ గౌడ్ ఇంటికెళ్లి వస్తానని చెప్పాడు. దీనికి ఒప్పుకున్న ఆ యువతి వచ్చేవరకు ఎదురు చూస్తానని చెప్పింది. అయితే, ఎంతకీ అతడు తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందింది. పైగా ఫోన్ కూడా కలవకపోవడంతో బాధిత యువతి నేరుగా నందవరంకు వెళ్లింది.
అయితే, అబ్బాయిని కలవడానికి అత్తామామలు నిరాకరించడంతో అక్కడే బైఠాయించింది. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు న్యాయం జరిగే వరకు కదలనని కూర్చుంది. బాధితురాలికి మహిళా సంఘాలు అండగా నిలిచాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఫిర్యాదు చేస్తే విచారించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.






