- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తనని పెళ్లిచేసుకోమని ఆంటీ వెంటపడిన యువకుడు.. విషయం భర్తకు తెలవడంతో..
<p>దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధానిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తనని పెళ్లి చేసుకోవాలని ఓ వివాహిత వెంటపడి, ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. దీంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని పూఠ్ఖుర్ద్ కు చెందిన ఓ వివాహిత తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తోంది. అయితే, మోంటూ అనే యువకుడు తనని పెళ్లి చేసుకోవాలంటూ గత కొద్ది రోజుల నుంచి ఆమె వెంటపడుతూ వేధించేవాడు. […]</p>

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధానిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తనని పెళ్లి చేసుకోవాలని ఓ వివాహిత వెంటపడి, ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. దీంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని పూఠ్ఖుర్ద్ కు చెందిన ఓ వివాహిత తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తోంది. అయితే, మోంటూ అనే యువకుడు తనని పెళ్లి చేసుకోవాలంటూ గత కొద్ది రోజుల నుంచి ఆమె వెంటపడుతూ వేధించేవాడు. అయితే, ఆమె ఈ విషయాన్ని మొదట్లో కామన్ గా తీసుకున్నది. కానీ, ఆ తర్వాత కూడా అతను అలాగే వెంటపడుతుంటే చేసేది లేక తన భర్తకు విషయం చెప్పింది. ఇంతలోనే ఆమెపై ఆ యువకుడు యాసిడ్ దాడి చేశాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి బక్సర్ కు పారిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని బీహార్ లో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ఆమె భర్త డిమాండ్ చేస్తున్నాడు.






