- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణం తీసిన కరోనా భయం.. నిప్పంటించుకుని బలవన్మరణం
<p>దిశ, స్టేషన్ ఘన్ పూర్: కరోనా భయంతో ఓ యువకుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం జఫర్గడ్ మండలం హిమ్మత్ నగర్ లో సోమవారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. హిమ్మత్ నగర్ కు చెందిన నారా బోయిన కనకరాజు (26) కరోనా సోకిందనే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ గ్రామానికి చెందిన సమీప బంధువు నాలుగు […]</p>

దిశ, స్టేషన్ ఘన్ పూర్: కరోనా భయంతో ఓ యువకుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం జఫర్గడ్ మండలం హిమ్మత్ నగర్ లో సోమవారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. హిమ్మత్ నగర్ కు చెందిన నారా బోయిన కనకరాజు (26) కరోనా సోకిందనే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ గ్రామానికి చెందిన సమీప బంధువు నాలుగు రోజుల కిందట కరోనాతో మృతిచెందాడు.
అంత్యక్రియలకు హాజరై వచ్చిన కనకరాజుకు గత మూడు రోజులుగా జ్వరం వస్తుండడంతో.. తనకు కూడా కరోనా వచ్చిందేమోననే భయంతో ఆదివారం రాత్రి పెట్రోల్ తెచ్చుకుని ఇంట్లో భద్రపరచుకున్న కనకరాజు.. సోమవారం తెల్లవారుజామున ఇంటికి సమీపంలోని ముళ్ళ పొదల మధ్య ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన స్థలాన్ని వర్ధన్నపేట ఏసిపి రమేష్, సీఐ విశ్వేశ్వర్, ఎస్సై కిషోర్ లు సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






