అర్ధరాత్రి అమానుషం.. మహిళపై యువకుడి లైంగికదాడి

by Batti.Sumithra |

<p>దిశ, దంతాలపల్లి: మహిళపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల పరిధిలో సోమవారం రాత్రి జరుగగా మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. దంతాలపల్లి మండలానికి చెందిన ఓ మహిళ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి తన చేనుకు రాత్రి కాపలా ఉండేందుకు వెళ్లింది. ఇంతలో పక్కనే తండాకు చెందిన ఓ యువకుడు దగ్గర్లోని మామిడి తోటలోకి బలవంతంగా లాక్కెళ్లి [&hellip;]</p>

gang rape in Gandhi Hospital
X

దిశ, దంతాలపల్లి: మహిళపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల పరిధిలో సోమవారం రాత్రి జరుగగా మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. దంతాలపల్లి మండలానికి చెందిన ఓ మహిళ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి తన చేనుకు రాత్రి కాపలా ఉండేందుకు వెళ్లింది. ఇంతలో పక్కనే తండాకు చెందిన ఓ యువకుడు దగ్గర్లోని మామిడి తోటలోకి బలవంతంగా లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story