అగ్గిపుల్లలతో యువకుడి సైకిల్ మిరాకిల్

by Shamantha N |   (  Updated:2021-06-03 02:27:50  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్ : ఒక మనిషి తన మేధస్సునుపమోగించి ఎన్నో అధ్భుతాలను సృష్టిచగలడు అనడానికి ఎన్నో నిదర్శణాలున్నాయి. అలా ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఓ యువకుడు సైల్ తయారు చేసిన విధానం అందరిని ఆకర్షించింది. చిన్న చిన్న దూర ప్రాంతాలకు వెళ్లాలన్నా నడిచి వెళ్లకుండా సైకిల్ ని వాడుతారు. సైకిల్ అనేది వ్యాయామానికి ఎంతో మంచిది. బీపీ, మధుమోహం లాంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. రోజుకు ఐదారు కిలోమీటర్లు సైకిల్‌ తొక్కినట్లయితే ఆరోగ్యానికి ఎంతో [&hellip;]</p>

అగ్గిపుల్లలతో యువకుడి సైకిల్ మిరాకిల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఒక మనిషి తన మేధస్సునుపమోగించి ఎన్నో అధ్భుతాలను సృష్టిచగలడు అనడానికి ఎన్నో నిదర్శణాలున్నాయి. అలా ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఓ యువకుడు సైల్ తయారు చేసిన విధానం అందరిని ఆకర్షించింది. చిన్న చిన్న దూర ప్రాంతాలకు వెళ్లాలన్నా నడిచి వెళ్లకుండా సైకిల్ ని వాడుతారు. సైకిల్ అనేది వ్యాయామానికి ఎంతో మంచిది. బీపీ, మధుమోహం లాంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. రోజుకు ఐదారు కిలోమీటర్లు సైకిల్‌ తొక్కినట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. ప్రస్తుతం సైకిల్ వాడకం అనేది చాలా తగ్గిపోయింది. కొద్దిదూరాల్లోకి వెళ్లడానికి కూడా మోటర్ సైకిల్ ను ఉపమోగిస్తున్నారు. దీని వలన పర్యావరణానికి హాని కలుగుతుంది.

జూన్‌ 3వ తేదీన ప్రపంచ సైకిల్‌ దినోత్సవం జరుపుకొంటారు. 2018 ఏప్రిల్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రతి సంవత్సరం జూన్‌ 3న ప్రపంచ సైకిల్‌ దినోత్సవంగా ప్రకటించింది. ఈ దినోత్సవం కోసం లెస్జెక్ సిబిల్స్కి అనే ఓ సామాజికవేత్త ప్రచారం, తుర్క్మనిస్తాన్‌ 56 ఇతర దేశాల మద్దతు ఫలితంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. అయితే ఈ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ యువకుడు అగ్గిపుల్లతో అద్భుతమైన సైకిల్‌ను ఆవిష్కరించాడు. ఈ వినూత్న సైకిల్ 1870 నుంచి 1880 కాలంనాటి సైకిల్ మోడల్‌లో ఉంది. 3,653 అగ్గిపెట్టెలను ఉపయోగించి 50 అంగుళాల పొడవు 25 అంగుళాల వెడల్పుగల సైకిల్‌ను తయారు చేశాడు. ఒడిశాలోని పూరికి చెందిన సాస్వత్ రంజన్ సాహూ అనే 18 ఏళ్ల కుర్రాడు తాను పాఠశాలలో చదువుకునే రోజుల్లో ఈ మోడల్ సైకిల్ చూశానని అది నాకు చాలా బాగా నచ్చిందని అందుకే ఈనాటి సైకిల్ మోడల్ తోనే అగ్గిపుల్లలతో తయారు చేయాలనిపించిందని తెలిపారు. అగ్గిపుల్లలతో సైకిల్ తయారుచేసి అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు.

Next Story