- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలనిజమైన రోజు.. ఘనంగా సంబరాలు…
<p>దిశ, షాద్‌నగర్: ఎన్నో పోరాటాలు మరెన్నో ప్రాణత్యాగాలు.. బతుకు కోసం.. భాష కోసం.. అలుపెరగక సాగిన సమరంతో సిద్దించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బుధవారం షాద్‌నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో సంబరంగా జరుపుకున్నారు. పట్టణంలో నిర్వహించిన పలు కార్యక్రమాలలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ జెండాను ఆవిష్కరించారు. షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో షాద్‌నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వర్కాల లక్ష్మీనారాయణ గౌడ్, ఆర్డీవో కార్యాలయం ఆవరణలో […]</p>

దిశ, షాద్‌నగర్: ఎన్నో పోరాటాలు మరెన్నో ప్రాణత్యాగాలు.. బతుకు కోసం.. భాష కోసం.. అలుపెరగక సాగిన సమరంతో సిద్దించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బుధవారం షాద్‌నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో సంబరంగా జరుపుకున్నారు. పట్టణంలో నిర్వహించిన పలు కార్యక్రమాలలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ జెండాను ఆవిష్కరించారు.
షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో షాద్‌నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వర్కాల లక్ష్మీనారాయణ గౌడ్, ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఆర్డీవో రాజేశ్వరి, మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, ఏసీపీ కార్యాలయం వద్ద ఏసీపీ ఖుషాల్కర్, కేశంపేట ఎంపీపీ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ రవీందర్ యాదవ్, సింగిల్ విండో కార్యాలయం ఆవరణలో సింగిల్ విండో చైర్మన్ జగదీశ్వర్ గౌడ్‌లు జెండాను ఆవిష్కరించారు.






