- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శంషాబాద్‌లో మహిళ దారుణ హత్య
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మహిళ దారుణ హత్యకు గురైంది. ఎయిర్‌పోర్టులోని ఎన్ఎండీసీ సర్కిల్ సమీపంలో శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం ఉందని పోలీసులు తెలిపారు. కాగా, మహిళను గత రాత్రి హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతురాలి వయసు 35-40 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మహిళ దారుణ హత్యకు గురైంది. ఎయిర్‌పోర్టులోని ఎన్ఎండీసీ సర్కిల్ సమీపంలో శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం ఉందని పోలీసులు తెలిపారు. కాగా, మహిళను గత రాత్రి హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతురాలి వయసు 35-40 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
Next Story






