- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్ లో దారుణం.. రాళ్లతో ఓ మహిళను కొట్టి చంపారు
by Batti.Sumithra |
<p>దిశ, వరంగల్: ప్రపంచం ఆధునికంగా అభివృద్ధిలో దూసుకుపోతోన్నది. కానీ, కొంతమంది మాత్రం మానవీయతను కోల్పోయి పైసలు, ఆస్తులే పరమావధిగా భావిస్తూ ఎదుటి వ్యక్తుల ప్రాణాలను బలిగొంటున్నారు. భూమి కౌలు వివాదం ఓ మహిళను బలిగొంది. విషయమేమిటంటే.. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో పోసారపు రాజయ్యకు చెందిన భూమిని అదే గ్రామానికి చెందిన మల్లయ్య కౌలు చేస్తున్నాడు. ఇటీవల అదే భూమిని రాజయ్య తన కూతురు లత(36) అప్పగించాడు. ఈ విషయమై కొద్ది రోజులుగా రాజయ్య, […]</p>
దిశ, వరంగల్: ప్రపంచం ఆధునికంగా అభివృద్ధిలో దూసుకుపోతోన్నది. కానీ, కొంతమంది మాత్రం మానవీయతను కోల్పోయి పైసలు, ఆస్తులే పరమావధిగా భావిస్తూ ఎదుటి వ్యక్తుల ప్రాణాలను బలిగొంటున్నారు. భూమి కౌలు వివాదం ఓ మహిళను బలిగొంది.
విషయమేమిటంటే.. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో పోసారపు రాజయ్యకు చెందిన భూమిని అదే గ్రామానికి చెందిన మల్లయ్య కౌలు చేస్తున్నాడు. ఇటీవల అదే భూమిని రాజయ్య తన కూతురు లత(36) అప్పగించాడు. ఈ విషయమై కొద్ది రోజులుగా రాజయ్య, మల్లయ్య కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున మల్లయ్య సంబంధీకులు రాళ్లతో దాడి చేయడంతో లత తీవ్రంగా గాయపడింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
Next Story






