- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాకప్‌లో వేసి రేప్ చేశారు
<p>దిశ, వెబ్‌డెస్క్: హత్య కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు తనను పది రోజుల పాటు లాకప్‌లో వేసి రేప్ చేశారని నిందితురాలిగా ఉన్న ఓ బాధిత మహిళ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రేవా జిల్లాలో ఓ హత్య కేసులో మహిళా ఖైదీ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే తొలుత ఈ ఏడాది మే నెలలో అదుపులోకి తీసుకున్న పోలీసులు అదే నెల 10 నుంచి 21 వరకు లాకప్‌లో […]</p>

దిశ, వెబ్‌డెస్క్: హత్య కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు తనను పది రోజుల పాటు లాకప్‌లో వేసి రేప్ చేశారని నిందితురాలిగా ఉన్న ఓ బాధిత మహిళ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
రేవా జిల్లాలో ఓ హత్య కేసులో మహిళా ఖైదీ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే తొలుత ఈ ఏడాది మే నెలలో అదుపులోకి తీసుకున్న పోలీసులు అదే నెల 10 నుంచి 21 వరకు లాకప్‌లో వేశారన్నారు. ఇదే అదును చూసిన పోలీసులు తన పై పది రోజుల పాటు అత్యాచారం చేశారని ఆరోపించారు.
ఈ విషయం పై ఓ మహిళా కానిస్టేబుల్‌కు చెప్పి ఆమె పై బెదిరింపులకు పాల్పడ్డారని సదరు మహిళ చెప్పుకొచ్చారు. అనంతరం తనిఖీల్లో భాగంగా జైలుకొచ్చిన న్యాయమూర్తికి మహిళా ఖైదీ జరిగిన విషయం చెప్పడంతో వ్యవహారం బయటకొచ్చింది. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్యాచారం ఘటన పై దర్యాప్తు చేయించాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.






