భర్తల్ని చంపే భార్యల కంటే నువ్వే నయం తల్లి

by Vadlamudi Anukaran |   (  Updated:2021-01-20 02:38:13  IST  )

<p>దిశ,వెబ్‌డెస్క్: కలియుగంలో ఖతర్నాక్ భార్యలు పుట్టుకొస్తున్న ఘటనల్ని మనం చూసే ఉంటాం. ఇటీవల అక్రమ సంబంధం కోసం కట్టుకున్న భర్తలను నమ్మించి.. గొంతుకోసి గిలాగిలా కొట్టుకుంటుంటే చూస్తూ రాక్షసానందాన్ని పొందిన భార్యల్ని చూశాం. కానీ ఈ భార్య మాత్రం భర్తతో తనకున్న అనుంబంధాన్ని గౌరవిస్తున్నానని నిరూపిస్తోంది. ఇటీవల మహరాష్ట్ర పూణేలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ పంచాయితీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఖేడ్ తాలూకాలోని &#8216;పలు&#8217; అనే గ్రామానికి చెందిన సంతోష్ గౌరవ్ సర్పంచ్ [&hellip;]</p>

భర్తల్ని చంపే భార్యల కంటే నువ్వే నయం తల్లి
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగంలో ఖతర్నాక్ భార్యలు పుట్టుకొస్తున్న ఘటనల్ని మనం చూసే ఉంటాం. ఇటీవల అక్రమ సంబంధం కోసం కట్టుకున్న భర్తలను నమ్మించి.. గొంతుకోసి గిలాగిలా కొట్టుకుంటుంటే చూస్తూ రాక్షసానందాన్ని పొందిన భార్యల్ని చూశాం. కానీ ఈ భార్య మాత్రం భర్తతో తనకున్న అనుంబంధాన్ని గౌరవిస్తున్నానని నిరూపిస్తోంది. ఇటీవల మహరాష్ట్ర పూణేలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ పంచాయితీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఖేడ్ తాలూకాలోని ‘పలు’ అనే గ్రామానికి చెందిన సంతోష్ గౌరవ్ సర్పంచ్ గా గెలుపొందారు. దీంతో భర్త గెలుపుతో భార్య రేణుక తబ్బిబ్బు పోయింది. అంతేకాదు భర్త సంతోష్ గెలుపు కలకలాం గుర్తుండిపోయేలా చేసింది.

కరోనా కారణంగా కలెక్టర్ ఎన్నికల విజయోత్సవాల్ని జరిపేందుకు నిషేదించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు. దీంతో భార్య రేణుక కరోనా నిబంధనల్ని పాటిస్తూ భర్త సంతోష్ ను స్వయంగా తన భుజాలపై ఎక్కించుకొని ఊరంతా తిప్పుతూ ఊరేగిచింది.

ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భర్తల్ని చంపే భార్యల కంటే నువ్వే నయం తల్లి అంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం ఆసక్తికరంగా మారింది.

Next Story