రాహుల్ హత్య కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన నిందితుడు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: విజయవాడలో సంచలనం సృష్టించిన యువ వ్యాపారవేత్త కరణం రాహుల్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన కోరాడ విజయ్‌ కుమార్ ఆదివారం మాచవరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. విజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. ఇకపోతే కోరాడ విజయ్‌కుమార్.. రాహుల్‌తో కలిసి వ్యాపారం నిర్వహించారు. అయితే 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన విజయ్ కంపెనీల్లో తన వాటాకింద [&hellip;]</p>

rahul
X

దిశ, ఏపీ బ్యూరో: విజయవాడలో సంచలనం సృష్టించిన యువ వ్యాపారవేత్త కరణం రాహుల్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన కోరాడ విజయ్‌ కుమార్ ఆదివారం మాచవరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. విజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. ఇకపోతే కోరాడ విజయ్‌కుమార్.. రాహుల్‌తో కలిసి వ్యాపారం నిర్వహించారు. అయితే 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన విజయ్ కంపెనీల్లో తన వాటాకింద రావాల్సిన రూ.15 కోట్లు ఇవ్వాలని ఒత్తిడి పెంచాడు. ఇవ్వకపోవడంతో హత్య చేయించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రాహుల్ తండ్రి రాఘవ రావు ఫిర్యాదు మేరకు ఈ హత్య కేసులో ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు A-1 కోరాడ విజయ్, A-2 పద్మజ, A-3 గాయత్రి, A-4 కోగంటి సత్యం పేర్లను పేర్కొన్నారు. సెక్షన్ 302, 120బి, రెడ్‌విత్‌ 34 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story