కిరాణా దుకాణంలోకి… దూసుకెళ్లిన ట్రాక్టర్

by  |
కిరాణా దుకాణంలోకి… దూసుకెళ్లిన ట్రాక్టర్
X

దిశ, పటాన్‌చెరు: ట్రాక్టర్ అదుపుతప్పి దుకాణంలోకి దూసుకెళ్లడంతో.. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… ఓ ట్రాక్టర్ డ్రైవర్ తప్పతాగి ట్రాక్టర్ నడపుతూ… రుద్రారంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ కిరాణం దుకాణంలోకి దూసుకెళ్లాడు.

దీంతో దుకాణం ఎదుట ఉన్న ఓ ద్విచక్ర వాహనంతో పాటు కిరాణా దుకాణంలో సరుకులు, ఫర్నిచర్ ధ్వంసం కాగా కిరాణా సరుకులకు వచ్చిన ఇద్దరు యువకులు రమేష్, చంద్ర శేఖర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ నాగరాజు తప్పతాగి నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి బాధితున్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed