పట్టపగలు చోరీ.. 14 తులాల బంగారం మాయం

by Batti.Sumithra |

<p>దిశ, జనగామ‌: జనగామ జిల్లా కేంద్రంలో ఓ ఇంట్లో పట్టపగలే దొంగతనం జరిగింది. సీఐ మల్లేష్ యాదవ్ వివరాల ప్రకారం… జనగామ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్‌కు చెందిన ఎస్.రాజేశ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో స్వగ్రామమైన వెల్మజాలకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతో అనుమానంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇంట్లో ఉన్న 14 తులాల బంగారం, 26 [&hellip;]</p>

పట్టపగలు చోరీ.. 14 తులాల బంగారం మాయం
X

దిశ, జనగామ‌: జనగామ జిల్లా కేంద్రంలో ఓ ఇంట్లో పట్టపగలే దొంగతనం జరిగింది. సీఐ మల్లేష్ యాదవ్ వివరాల ప్రకారం… జనగామ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్‌కు చెందిన ఎస్.రాజేశ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో స్వగ్రామమైన వెల్మజాలకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతో అనుమానంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇంట్లో ఉన్న 14 తులాల బంగారం, 26 తులాల వెండి రూ.25 వేల నగదును గుర్తుతెలియని దుండగులు దోచుకెళ్లినట్టు సీఐ విచారణలో తేలింది. ఈ ఘటనపై జనగామ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్ క్లూస్ టీం, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగతనం పై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Next Story