- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరాచకం: అర్ధరాత్రి ఇంట్లోకి దూరి.. మృతదేహాన్ని రేప్ చేసిన యువకుడు..
<p>దిశ, వెబ్‌డెస్క్: మహిళలపై అఘాయిత్యాలు అంతకంతకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా కామవాంఛతో రగిలిపోతున్న కామాంధులు మహిళలపై దారుణాలకు ఒడిగడుతూనే ఉన్నారు. తాజాగా ఓ వృద్ధురాలిని యువకుడు దారుణంగా హత్య చేసి, ఆమె మృతదేహన్ని అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. హనుమాన్ ఘర్ లో ఓ వృద్ధురాలు(60) ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె ఇంటి పక్కనే సురేంద్ర(19) అనే యువకుడు నివసిస్తున్నాడు. […]</p>

దిశ, వెబ్‌డెస్క్: మహిళలపై అఘాయిత్యాలు అంతకంతకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా కామవాంఛతో రగిలిపోతున్న కామాంధులు మహిళలపై దారుణాలకు ఒడిగడుతూనే ఉన్నారు. తాజాగా ఓ వృద్ధురాలిని యువకుడు దారుణంగా హత్య చేసి, ఆమె మృతదేహన్ని అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్ లో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. హనుమాన్ ఘర్ లో ఓ వృద్ధురాలు(60) ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె ఇంటి పక్కనే సురేంద్ర(19) అనే యువకుడు నివసిస్తున్నాడు. గతకొద్దిరోజులుగా ఒంటరిగా నివసిస్తోన్న వృద్ధురాలిపై యువకుడు కన్నేశాడు. ఈ క్రమంలోనే ఈ నెల 15న రాత్రి ఆమె ఇంట్లోకి దూరి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. అనుకోని సంఘటనకు షాక్ అయిన వృద్ధురాలు యువకుడిని ప్రతిఘటించింది. దీంతో కోపంతో రగిలిపోయిన టీనేజర్ ఆమెను దారుణంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అత్యాచారం చేశాడు. వృద్ధురాలి ఇంటి నుంచి ఎటువంటి శబ్దం వినిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆమె ఇంట్లోకి వెళ్లి చూడగా విగతజీవిగా పడిఉంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారించగా యువకుడు వృద్ధురాలి ఇంటికి వచ్చినట్లు గుర్తించి, తమదైన రీతిలో విచారించగా నిజం బయటపెట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
- Tags
- Dead body






