- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోడకూలి ఏడేళ్ల చిన్నారి మృతి
<p>దిశ, హైదరాబాద్: ప్రమాదవశాత్తు గోడకూలి ఏడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… సంజయ్ నగర్లో చెందిన జయకృష్ణ అనే వ్యక్తి.. కొత్త ఇల్లును కట్టుకునేందుకు తన పాత ఇంటిని కూల్చివేస్తున్నాడు. రెండు రోజుల క్రితం నుంచి కూల్చివేత పనులు నిలిపివేశారు. ఇంటి ముందున్న ఇటుకల వల్ల రాకపోకలకు ఇబ్బందులకు అవుతున్నాయని జయకృష్ణ తల్లి విజయలక్ష్మీ, ఆయన కూతుళ్లు దివ్య, జయశ్రీ ఇటుకలు తొలగిస్తున్నారు. సోమవారం ప్రమాదవశాత్తు గోడ […]</p>

X
దిశ, హైదరాబాద్: ప్రమాదవశాత్తు గోడకూలి ఏడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే… సంజయ్ నగర్లో చెందిన జయకృష్ణ అనే వ్యక్తి.. కొత్త ఇల్లును కట్టుకునేందుకు తన పాత ఇంటిని కూల్చివేస్తున్నాడు. రెండు రోజుల క్రితం నుంచి కూల్చివేత పనులు నిలిపివేశారు. ఇంటి ముందున్న ఇటుకల వల్ల రాకపోకలకు ఇబ్బందులకు అవుతున్నాయని జయకృష్ణ తల్లి విజయలక్ష్మీ, ఆయన కూతుళ్లు దివ్య, జయశ్రీ ఇటుకలు తొలగిస్తున్నారు. సోమవారం ప్రమాదవశాత్తు గోడ కూలడంతో ఏడేళ్ల జయశ్రీ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో గాయాలైన విజయలక్ష్మీ, దివ్యలను విద్యానగర్‌లోని ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి జయశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story






