- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రహమాన్ కూతురు ఎంట్రీ?
<p>వారసత్వం అనేది సినీ ఇండస్ట్రీలో మామూలే. హీరో కొడుకు హీరో కావడం, కూతురు హీరోయిన్‌గా రాణించడం చూస్తూనే ఉంటాం. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీని తీసుకున్నా సరే.. వారసులను ఇంట్రడ్యూస్ చేసేందుకు, వారికి ఒక సెలబ్రిటీ స్థానాన్ని కల్పించేందుకు స్టార్ సెలబ్రిటీలు ట్రై చేస్తూనే ఉంటారు. కాగా, కొత్తగా ఆస్కార్ అవార్డ్ విన్నర్‌గా తన పేరును ప్రపంచమంతా వినిపించిన ఏఆర్ రహమాన్.. తన కూతురిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. కానీ తండ్రి […]</p>

వారసత్వం అనేది సినీ ఇండస్ట్రీలో మామూలే. హీరో కొడుకు హీరో కావడం, కూతురు హీరోయిన్‌గా రాణించడం చూస్తూనే ఉంటాం. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీని తీసుకున్నా సరే.. వారసులను ఇంట్రడ్యూస్ చేసేందుకు, వారికి ఒక సెలబ్రిటీ స్థానాన్ని కల్పించేందుకు స్టార్ సెలబ్రిటీలు ట్రై చేస్తూనే ఉంటారు. కాగా, కొత్తగా ఆస్కార్ అవార్డ్ విన్నర్‌గా తన పేరును ప్రపంచమంతా వినిపించిన ఏఆర్ రహమాన్.. తన కూతురిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. కానీ తండ్రి మ్యూజిక్ డైరెక్టర్ కదా అని.. తాను కూడా సంగీత సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలని అనుకోవడం లేదు. నటిగా నిలదొక్కుకోవాలని ఆరాటపడుతోంది.
అవును.. రహమాన్ ముగ్గురు కూతుర్లలో ఒకరైన రహిమా రహమాన్.. హీరోయిన్‌గా రాణించాలని ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే మ్యూజిక్ నేర్చుకున్న రహిమా.. సంగీతం కన్నా నటనపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందని తెలుస్తోంది. దీంతో రహమాన్ కూతురిని ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాడు. ఇందుకోసం రహిమాను యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో జాయిన్ చేసిన రెహమాన్.. వచ్చే ఏడాది బాలీవుడ్ సినిమాతో కూతురును హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నట్టు టాక్.






