ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు..

256

దిశ, కోదాడ: ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడి పది మంది గాయాలైన సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ఆకు పాముల శివారులో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుండి కాకినాడ వెళుతున్న శ్రీ కృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు స్పీడ్ గా వస్తున్న క్రమంలో ఎదురుగా లారీని తప్పించబోయి పక్కన ఉన్న వ్యవసాయ పొలంలో పడింది 40 మంది ప్రయాణికులు ఉండగా పది మందికి గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న మునగాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని 108 సహాయంతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్లారు. ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయ స్థితి లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంత జరిగినా ట్రావెల్స్ బస్సులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. కనీసం క్షతగాత్రులకు ఎలా ఉందో కూడా తెలుసుకోలేదని ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉందని అన్నారు. డ్రైవర్ పరారయ్యారని అంటున్నారు.