ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమా..?

by Batti.Sumithra |   (  Updated:2021-08-19 09:10:08  IST  )

<p>దిశ, గద్వాల : మొదటి కాన్పు కోసం‌ గద్వాల ప్రభుత్వా ఆసుపత్రికి వచ్చిన ఓ నిండు గర్బిణి గురువారం మృతి చెందింది. వివరాల్లోకి వెళ్లితే వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన శృతి (21) కాన్పుకోసం ఈనెల 17న గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. రెండురోజుల వైద్య పరీక్షల అనంతరం గురువారం తెల్లవారుజామున గర్బిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందికి తెలియజేశారు. ఆ సమయంలో వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో హైబీపీ వచ్చి [&hellip;]</p>

ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమా..?
X

దిశ, గద్వాల : మొదటి కాన్పు కోసం‌ గద్వాల ప్రభుత్వా ఆసుపత్రికి వచ్చిన ఓ నిండు గర్బిణి గురువారం మృతి చెందింది. వివరాల్లోకి వెళ్లితే వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన శృతి (21) కాన్పుకోసం ఈనెల 17న గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. రెండురోజుల వైద్య పరీక్షల అనంతరం గురువారం తెల్లవారుజామున గర్బిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందికి తెలియజేశారు. ఆ సమయంలో వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో హైబీపీ వచ్చి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే నిండు గర్బిణి మృతి చెందినట్లు వారు ఆరోపించారు. పురిటి నొప్పులు వస్తున్నప్పుడు డాక్టర్లు అందుబాటులో లేకపోవడం కారణంగానే నా భార్య చనిపోయిందని భర్త స్టీపెన్ ఆరోపించారు. విషయం తెలుసుకున్న గద్వాల సీఐ షేక్ మహబుబ్ బాషా గద్వాల ఆసుపత్రి చేరుకుని విచారణ చేపట్టారు. జిల్లా సూపరింటెండెంటు డాక్టర్ కిశోర్ కుమార్ వివరణ కోరగా.. గర్బిణీకి మొదటి నుంచి బీపీ ఉండటంతో బీపి తగ్గించడానికి ట్రీట్మెంట్ చేశామని ఈ రోజు ఉదయం పేషెంట్ కు హైబీపీతో పాటు వాంతులు రావడంతో కాపాడలేకపోయామని తెలిపారు. మృతి చెందిన గర్భిణీ బంధువుల రోదనలు ఆసుపత్రిలో మిన్నంటాయి.

Next Story