నా వద్ద పిస్తోలు కాదు కత్తి ఉంది.. నరికితే రెండు ముక్కలైతవ్.. కానిస్టేబుల్ వీరంగం.. (వీడియో)

by  |
నా వద్ద పిస్తోలు కాదు కత్తి ఉంది.. నరికితే రెండు ముక్కలైతవ్.. కానిస్టేబుల్ వీరంగం.. (వీడియో)
X

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో మరో కానిస్టేబుల్ సామాన్య ప్రజలపై తిట్ల దండకాన్ని ఎత్తుకున్నాడు. గత కొద్ది రోజుల క్రితం ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించి పోలీసుల పరువును బజారున పడేసిన ఉదంతం మరువక ముందే, తాజాగా ఆదివారం రాత్రి పూటుగా తాగి వినాయక మండపం వద్ద ఉన్న భక్తులపై సబ్ జైల్ కానిస్టేబుల్ నాగరాజు వీరంగం సృష్టించాడు. సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్న భక్తులను, అక్కడ ఉన్న నిర్వాహకులను పరుష పదజాలంతో దూషించాడు. నేను పోలీస్ నన్నెవడూ ఏం చేయలేరు. రారా చూసుకుందాం.! నావద్ద పిస్తోలు లేకున్నా కత్తి ఉంది.. నరికితే రెండు ముక్కలైతవ్..! అంటూ వీధి రౌడీలా గల్లా ఎగిరేస్తూ సవాల్ చేశాడు.

దీనిపై యువకులు డయల్ 100కు ఫోన్ చేస్తే పోలీస్ కానిస్టేబుల్ అని చెప్పడంతో తరువాత మాట్లాడదాం అంటూ ఫోన్ పెట్టేసారని యువకులు లిఖిత పూర్వకంగా స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదంతా వీడియో తీసి ఆధారాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సదరు కానిస్టేబుల్ పై గతంలోనూ అనేక బెదిరింపులు, అవినీతి, వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా పోలీసులు వెనకేసుకురావడం ఏంటని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed