- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
<p>దిశ, ఆందోల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన అందోల్ మండల పరిధిలోని అల్మాయిపేట శివారులో ప్రధాన రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పుల్కల్ మండలం బొమ్మారెడ్డి గూడెం గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ (22) శుక్రవారం సాయంత్రం తన పనులను ముగించుకుని జోగిపేట నుంచి స్వగ్రామానికి బైక్ పై వెళుతున్నాడు. ఈ కమ్రంలో అల్మాయిపేట బ్రిడ్జి వద్ద బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో […]</p>

X
దిశ, ఆందోల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన అందోల్ మండల పరిధిలోని అల్మాయిపేట శివారులో ప్రధాన రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పుల్కల్ మండలం బొమ్మారెడ్డి గూడెం గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ (22) శుక్రవారం సాయంత్రం తన పనులను ముగించుకుని జోగిపేట నుంచి స్వగ్రామానికి బైక్ పై వెళుతున్నాడు. ఈ కమ్రంలో అల్మాయిపేట బ్రిడ్జి వద్ద బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో జ్ఞానేశ్వర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






