మనవరాలు వయస్సున్న ఆ చిన్నారిని ఓ వృద్ధుడు…

by  |
మనవరాలు వయస్సున్న ఆ చిన్నారిని ఓ వృద్ధుడు…
X

దిశ,కొత్తగూడెం: మహిళల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠినతరమైన చట్టాలు తీసుకు వచ్చినా కామాంధుల కనురెప్ప కదలటం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇందులో మొదటి స్థానం సంపాదించింది అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు అని చెప్పడానికి అనేక కారణాలున్నాయి. కొన్ని నెలల క్రితం లక్ష్మీదేవి పల్లి మండలం చింతవెర్రె గ్రామంలో జరిగిన ఘటన దీనికి ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది. ఆ సంఘటన మరువక ముందే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం లో మైనర్ బాలికపై 65 సంవత్సరాల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 65ఏళ్ల వృద్ధుడు (శేషాగిరీరావు) ఓ బాలికపై అత్యాచారానికి యత్నించడం కలకలంరేపుతోంది. పాల్వంచ పట్టణ పరిధిలోని నవభారత్ గాంధీనగర్ కు చెందిన యన్.యం.డి.సి రిటైర్డ్ ఉద్యోగి శేషగిరిరావు. వాటర్ ప్లాంట్ పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నాడు. నిన్న సాయంత్రం అదే కాలనీకి చెందిన 9 సంవత్సరాల బాలికపై మద్యం మత్తులో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలికను వృద్ధుడు మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న వాటర్ ప్లాంట్ వెనుకకు తీసుకెళ్లాడు. అప్పటివరకు ఆడుకుంటున్న తన కూతురు కనిపించకపోవడంతో బాలిక తండ్రి వెదకడం ప్రారంభించారు. చివరకు వాటర్ ప్లాంట్ వెనుక ఉన్నట్లు గుర్తించాడు. బాలిక తండ్రిని చూసిన వృద్ధుడు అక్కడి నుండి పరారయ్యాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుని పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఫోక్సో కేసు నమోదు చేశారు

Next Story

Most Viewed