- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.15వేలకు 20రోజుల శిశువు విక్రయం
<p>దిశ బాల్కొండ: మోర్తాడ్ మండల కేంద్రంలోని గోవింద్‌రెడ్డికాలనీలో పద్మ అనే మహిళ.. అదే కాలనీలో నివాసముంటున్న పల్లపు కవితకు 20రోజుల శిశువును అమ్మినట్లు ఐసిడిఎస్ సూపర్‌వైజర్ ఉషారాణి తెలిపారు. ఈ విషయం అంగన్వాడీ కార్యకర్తల ద్వారా తెలియగానే సర్పంచ్ భోగ ధరణి ఆనంద్, కార్యదర్శి, ఎస్ఐ సంపత్ కుమార్‌ల సహకారంతో బాలుడిని జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంక్షేమ కేంద్రం పిడి స్వర్ణకు అప్పగించినట్లు పేర్కొన్నారు. శిశువును విక్రయించిన తల్లి, కొనుగోలు చేసిన మహిళ ఇద్దరూ బాన్సువాడ మండలంలోని […]</p>

X
దిశ బాల్కొండ: మోర్తాడ్ మండల కేంద్రంలోని గోవింద్‌రెడ్డికాలనీలో పద్మ అనే మహిళ.. అదే కాలనీలో నివాసముంటున్న పల్లపు కవితకు 20రోజుల శిశువును అమ్మినట్లు ఐసిడిఎస్ సూపర్‌వైజర్ ఉషారాణి తెలిపారు. ఈ విషయం అంగన్వాడీ కార్యకర్తల ద్వారా తెలియగానే సర్పంచ్ భోగ ధరణి ఆనంద్, కార్యదర్శి, ఎస్ఐ సంపత్ కుమార్‌ల సహకారంతో బాలుడిని జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంక్షేమ కేంద్రం పిడి స్వర్ణకు అప్పగించినట్లు పేర్కొన్నారు. శిశువును విక్రయించిన తల్లి, కొనుగోలు చేసిన మహిళ ఇద్దరూ బాన్సువాడ మండలంలోని తూర్పురాంపూర్ గ్రామానికి చెందిన వారని తెలిపారు. శిశువును అమ్మిన మహిళకు భర్త చనిపోయాడని, కొనుగోలు చేసిన మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, కుమారుడు ఉంటే బాగుంటుందని భావించి రూ.15వేలకు కొనుగోలు చేశారన్నారు.
Next Story






