- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు రూపాయలకే కడుపునిండా భోజనం.. ఎక్కడో తెలుసా..!
<p>దిశ, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో సైన్య సేన ఆధ్వర్యంలో రూ. రెండు రూపాయలకు భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సైన్య సేన అధ్యక్షుడు ఎర్రోళ్ల నరేష్ మాట్లాడుతూ.. ఆర్డీఓ, తహలీల్దార్ కార్యాలయాలతో పాటు కోర్టుకు వచ్చే ప్రజలకు తినడానికి అనేక ఇబ్బందులు అవుతున్నాయని భావించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కార్యాలయాలకు వచ్చే నిరుపేదలకు పనులు ఆలస్యం జరుగుతుండటం, అలాగే కార్యాలయాల చుట్టుపక్కల ఎలాంటి హోటల్స్ లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోందని తెలిపారు. […]</p>

దిశ, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో సైన్య సేన ఆధ్వర్యంలో రూ. రెండు రూపాయలకు భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సైన్య సేన అధ్యక్షుడు ఎర్రోళ్ల నరేష్ మాట్లాడుతూ.. ఆర్డీఓ, తహలీల్దార్ కార్యాలయాలతో పాటు కోర్టుకు వచ్చే ప్రజలకు తినడానికి అనేక ఇబ్బందులు అవుతున్నాయని భావించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కార్యాలయాలకు వచ్చే నిరుపేదలకు పనులు ఆలస్యం జరుగుతుండటం, అలాగే కార్యాలయాల చుట్టుపక్కల ఎలాంటి హోటల్స్ లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోందని తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమానికి తాము శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. తమకు మరికొంత మంది దాతలు ఎవరైనా ముందుకు వస్తే ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకి తీసుకుని వెళతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన న్యాయవాదులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సైన్య సేన సభ్యులు శ్రీకాంత్, సందీప్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.






