- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మత్తు దొరకక మృత్యుఒడిలోకి
<p>దిశ, మెదక్: లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని వాణిజ్య వ్యాపారాలు మూసివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మద్యం, కల్లును కూడా బంద్ చేసింది. దీంతో మద్యం ప్రియులు మత్తు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజూ మద్యానికి అలవాటు పడిన శరీరం ఒక్కసారిగా మత్తు దొరకక పోవడంతో వింత వింత చేష్టలు చేస్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని బచ్చుగూడెంలో కల్లుకు బానిసైన వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన మల్లేశం(39) అనే […]</p>

దిశ, మెదక్: లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని వాణిజ్య వ్యాపారాలు మూసివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మద్యం, కల్లును కూడా బంద్ చేసింది. దీంతో మద్యం ప్రియులు మత్తు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజూ మద్యానికి అలవాటు పడిన శరీరం ఒక్కసారిగా మత్తు దొరకక పోవడంతో వింత వింత చేష్టలు చేస్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని బచ్చుగూడెంలో కల్లుకు బానిసైన వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన మల్లేశం(39) అనే వ్యక్తి కల్లుకు తీవ్రంగా బానిసయ్యాడు. రోజూ కల్లు తాగే అతడు లాక్‌డౌన్ నేపథ్యంలో కల్లు దొరక్కపోవడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలోనే మూడుసార్లు మూర్చ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించి తీసుకెళ్లగా మళ్లీ మూర్చ వచ్చి మృతి చెందాడు.
Tags: man, committed, strange acts, finding, alcohol, killed, medak, sangareddy






