బావిలో ప‌డి వ్యక్తి మృతి

by Batti.Sumithra |

<p>దిశ‌, డోర్నక‌ల్‌: ప్రమాద‌వ‌శాత్తు బావిలో ప‌డి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లా మ‌రిపెడ మండ‌ల ప‌రిధిలో బుధ‌వారం తెల్లవారుజామున జ‌రిగింది. ఎస్సై శ్రీ‌నివాస్ రెడ్డి తెలిపిన వివ‌రాల ప్రకారం.. ఖ‌మ్మం జిల్లా తిరుమ‌లాయిపాలెం మండ‌లం చంద్రుతండాకు చెందిన బోడ రాందాస్ మ‌రిపెడ మండ‌లం స్టేజీ తండా ప‌రిధిలోని మేగ్యా తండాలోని బంధువైన భూక్య బావుసింగ్ ఇంటికి పండుగ‌కు కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి వ‌చ్చాడు. బుధ‌వారం తెల్లవారుజామున బ‌హిర్భుమికి వెళ్లిన రాందాస్ ఎంత‌కీ తిరిగి [&hellip;]</p>

బావిలో ప‌డి వ్యక్తి మృతి
X

దిశ‌, డోర్నక‌ల్‌: ప్రమాద‌వ‌శాత్తు బావిలో ప‌డి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లా మ‌రిపెడ మండ‌ల ప‌రిధిలో బుధ‌వారం తెల్లవారుజామున జ‌రిగింది. ఎస్సై శ్రీ‌నివాస్ రెడ్డి తెలిపిన వివ‌రాల ప్రకారం.. ఖ‌మ్మం జిల్లా తిరుమ‌లాయిపాలెం మండ‌లం చంద్రుతండాకు చెందిన బోడ రాందాస్ మ‌రిపెడ మండ‌లం స్టేజీ తండా ప‌రిధిలోని మేగ్యా తండాలోని బంధువైన భూక్య బావుసింగ్ ఇంటికి పండుగ‌కు కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి వ‌చ్చాడు. బుధ‌వారం తెల్లవారుజామున బ‌హిర్భుమికి వెళ్లిన రాందాస్ ఎంత‌కీ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ‌స‌భ్యులు గాలించ‌గా స‌మీపంలోని బావిలో విగ‌తజీవిగా ప‌డి ఉన్నాడు. కుటుంబ‌స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Next Story