- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖాదర్‌పేటలో ఎడ్లబండిని ఢీకొని వ్యక్తి దుర్మరణం
<p>దిశ, చెన్నారావుపేట: ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం ఎడ్లబండిని ఢీ కొనడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన చెన్నారావుపేట మండలంలోని ఖాదర్‌పేట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… జల్లి గ్రామానికి చెందిన వల్లాజీ కుమార స్వామి(40) భార్య విజయతో కలిసి బైకుపై మల్లంపల్లిలోని బంధువులు ఇంటికి బయలు దేరారు. అదే సమయంలో ఖాదర్‌పేట గ్రామం వద్ద ఓ రైతు వ్యవసాయ పనులు ముగించుకొని ఎడ్లబండిపై ఇంటికి వెళుతున్నాడు. సరిగ్గా మూలమలుపు వద్ద కుమారస్వామి ద్విచక్ర వాహనంతో […]</p>

దిశ, చెన్నారావుపేట: ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం ఎడ్లబండిని ఢీ కొనడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన చెన్నారావుపేట మండలంలోని ఖాదర్‌పేట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… జల్లి గ్రామానికి చెందిన వల్లాజీ కుమార స్వామి(40) భార్య విజయతో కలిసి బైకుపై మల్లంపల్లిలోని బంధువులు ఇంటికి బయలు దేరారు. అదే సమయంలో ఖాదర్‌పేట గ్రామం వద్ద ఓ రైతు వ్యవసాయ పనులు ముగించుకొని ఎడ్లబండిపై ఇంటికి వెళుతున్నాడు. సరిగ్గా మూలమలుపు వద్ద కుమారస్వామి ద్విచక్ర వాహనంతో ఎడ్లబండిని ఢీకొట్టాడు. దీంతో కుమారస్వామి-విజయలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ మహేందర్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పోలీసు వాహనంలో చికిత్స నిమిత్తం నర్సంపేట లోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కుమారస్వామి మృతి చెందినట్లు సమాచారం. అతని భార్య విజయ చికిత్స పొందుతుంది. మృతునికి కుమారుడు కుమార్తె ఉన్నారు.






