- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పప్పుకుక్కర్‌తో.. వెరైటీగా ఆవిరి పట్టడం ఎలా ?
<p>దిశ, వెబ్ డెస్క్ : కరోనా విజృంభన కొనసాగుతున్న నేపథ్యంలో చాలా మంది కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఇంట్లోనే చికిత్స ప్రారంభిస్తున్నారు. కొంత మంది ఉదయాన్నే వేడి నీటిలో పసుపు వేసుకొని తాగడం, మరికొంత మంది కషాయం చేసుకొని తాగడం, ఆవిరి పట్టడం ఇలాంటివి పాటిస్తూ వారిని వారు కాపాడుకుంటున్నారు. అయితే ఎవరైనా ఓ బౌల్ లో వాటరు వేడి చేసి ఆవిరి పడుతారు. కానీ ఓ వ్యక్తి ఆవిరి పట్టే విధానం చూసి […]</p>

దిశ, వెబ్ డెస్క్ : కరోనా విజృంభన కొనసాగుతున్న నేపథ్యంలో చాలా మంది కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఇంట్లోనే చికిత్స ప్రారంభిస్తున్నారు. కొంత మంది ఉదయాన్నే వేడి నీటిలో పసుపు వేసుకొని తాగడం, మరికొంత మంది కషాయం చేసుకొని తాగడం, ఆవిరి పట్టడం ఇలాంటివి పాటిస్తూ వారిని వారు కాపాడుకుంటున్నారు. అయితే ఎవరైనా ఓ బౌల్ లో వాటరు వేడి చేసి ఆవిరి పడుతారు. కానీ ఓ వ్యక్తి ఆవిరి పట్టే విధానం చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఆవిరి పడితే ఆశ్చర్యపోవడం ఏంటీ అనుకుంటున్నారా.. అయితే మీరే చదవండి.
గ్రామీణ ప్రాంతంలో ఉండే ఓ వ్యక్తి వైరైటీగా ఆవిరిపడడం ఎలా అనే విధానాన్ని కనుగొన్నాడు. పప్పు కుక్కర్‌లో వాటర్ పోసి దాన్ని పొయ్యి మీద పెట్టి వాటర్ వేడయ్యాక దానికి ఓ పైప్ తగిలించాడు. అనంతరం ఆ పైప్ ద్వారా ఆవిరి బయటకు వస్తుండగా దానిముందు నిల్చొని ఆవిరి పట్టారు. అయితే ఓ వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అలా ఆవిరి పట్టడం చాలా బాగుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.






