- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నలుగురిపై పెట్రోల్ దాడి
<p>దిశ, వెబ్‌డెస్క్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ ఉన్మాది. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆచంట మండలం భీమలాపురం గ్రామానికి చెందిన కాండ్రేగుల నాగలక్ష్మికి.. ఆచంటకు చెందిన నరేష్ అనే వ్యక్తికి డబ్బు విషయంలో వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం నాగలక్ష్మి సోదరి మంగలక్ష్మిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన నాగలక్ష్మి భర్త, అతని తల్లి గాయపడ్డారు. పెట్రోల్ చల్లే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ ఉన్మాది. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆచంట మండలం భీమలాపురం గ్రామానికి చెందిన కాండ్రేగుల నాగలక్ష్మికి.. ఆచంటకు చెందిన నరేష్ అనే వ్యక్తికి డబ్బు విషయంలో వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం నాగలక్ష్మి సోదరి మంగలక్ష్మిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన నాగలక్ష్మి భర్త, అతని తల్లి గాయపడ్డారు. పెట్రోల్ చల్లే క్రమంలో అతనిపై కూడా పడడంతో మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు వారిని పాలకొల్లు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






