కారు ఢీకొని వ్యక్తి మృతి 

49

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం, లచ్చారాయపురం గ్రామం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉంగరాడ నుంచి రాజాం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు ఉంగరాడ గ్రామానికి చెందిన వారణాసి నాగభూషణరావు (59) గా గుర్తించారు.