- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కట్టమీద పట్టు తప్పింది.. ఆస్పత్రిలో ప్రాణం పోయింది
by Shyam |
<p>దిశ, వరంగల్: ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్ నగర్ గ్రామంలో మంగళవారం గూడ రాజయ్య (48) అనే వ్యక్తి దుక్కి దున్నేందుకు వెళ్తుండగా గ్రామ శివారులోని నాగమయ్య కుంటకట్టపై ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాజయ్యను స్థానికులు హన్మకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజయ్య మృతదేహాన్ని […]</p>

X
దిశ, వరంగల్: ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్ నగర్ గ్రామంలో మంగళవారం గూడ రాజయ్య (48) అనే వ్యక్తి దుక్కి దున్నేందుకు వెళ్తుండగా గ్రామ శివారులోని నాగమయ్య కుంటకట్టపై ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాజయ్యను స్థానికులు హన్మకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య ప్రమీలతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Next Story






