పక్కవారు చనిపోతున్నారనే భయంతో… వ్యక్తి మృతి

by  |
పక్కవారు చనిపోతున్నారనే భయంతో… వ్యక్తి మృతి
X

దిశ,వెబ్ డెస్క్ : కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తి పక్కవాళ్ళు చనిపోతున్నారనే భయంతో బయటకి వచ్చి చనిపోయిన ఘటన శనివారం హన్మకొండలోని అలంకార్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఉర్సు ప్రాంతానికి చెందిన తండ నర్సయ్య (60) కి గత నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో చేర్చారు. తాను ఆసుపత్రిలో చేరిన రెండు రోజులనుంచి తన పక్కనే ఉన్నవాళ్లు చనిపోతున్నారనే భయంతో ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాడు. అలా హన్మకొండ వైపు నడుస్తూ అలంకార్ జంక్షన్ వద్ద సృహతప్పి అక్కడే చనిపోయాడు. అది గమనించిన స్థానికులు వెంటనే హన్మకొండ పోలీస్టేషన్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వివరాలు సేకరించి అనతరం మునిసిపల్ సిబ్బంది ద్వారా శవాన్ని స్మశానవాటికకు తరలించారు.

Next Story