- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
<p>దిశ, మెదక్: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో 4వ వార్డు హనుమాన్ మందిర్ వీధిలో శనివారం చోటు చేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్సై నోముల వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా బంట్వాం మండలం తొర్మామిడి గ్రామానికి చెందిన బంటు రాజు(30) సత్వార్ సమీపంలోని ఓ దాబాలో పని చేస్తున్నాడు. రాజుకు ఆరు నెలల క్రితం ఖాశీంపూర్ గ్రామానికి చెందిన ఓ […]</p>

దిశ, మెదక్: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో 4వ వార్డు హనుమాన్ మందిర్ వీధిలో శనివారం చోటు చేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్సై నోముల వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా బంట్వాం మండలం తొర్మామిడి గ్రామానికి చెందిన బంటు రాజు(30) సత్వార్ సమీపంలోని ఓ దాబాలో పని చేస్తున్నాడు. రాజుకు ఆరు నెలల క్రితం ఖాశీంపూర్ గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. వీరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి అయినా రాజు ఇంటి నుంచి బయటకు రాకపోయేసరికి ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు చెరిచి చూడగా రాజు శవమై కనిపించాడు. గదిలో మద్యం, పురుగుల మందును పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలతోనే రాజు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Tags: Medak,suicide,police,family strife






