- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాక్‌డౌన్ రూల్స్‌బ్రేక్ చేసిన నేత.. రాత్రంతా రికార్డింగ్ డ్యాన్స్‌లు
<p>దిశ, పరిగి : వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో 11వ తేదీ జూన్ రాత్రి 9 నుంచి ఉదయం వరకు ఓ నేత రికార్డు డ్యాన్స్ నిర్వహించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి పిల్లి మొగులయ్య అనే ఓ పార్టీకి చెందిన నాయకుడు గ్రామంలో అర్థనగ్న డాన్స్ లతో, డీజే లతో హోరెత్తించారు. ఈ విషయం గురించి తెలిసి కూడా స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది చూసి […]</p>

X
దిశ, పరిగి : వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో 11వ తేదీ జూన్ రాత్రి 9 నుంచి ఉదయం వరకు ఓ నేత రికార్డు డ్యాన్స్ నిర్వహించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి పిల్లి మొగులయ్య అనే ఓ పార్టీకి చెందిన నాయకుడు గ్రామంలో అర్థనగ్న డాన్స్ లతో, డీజే లతో హోరెత్తించారు. ఈ విషయం గురించి తెలిసి కూడా స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహరించారు. సాయంత్రం 6 దాటితే చాలు రోడ్డు మీదకు ఒక్క వ్యక్తిని రానివ్వని పోలీసులు వందల మంది కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమం గురించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి నేతపై చర్యలు తీసుకోవాలని, స్థానిక పోలీసు అధికారుల తీరుపై పలువురు విమర్శిస్తున్నారు.
Next Story






