- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో ప్రేమోన్మాది దాడిలో కీలక మలుపు
<p>దిశ, ఏపీబ్యూరో: విశాఖలో సంచలనం సృష్టించిన ప్రేమోన్మాది, చికిత్సపొందుతూ మృతి చెందాడు. మాట్లాడుకుందామని స్నేహితురాలిని లాడ్డికి పిలిచి.. ఆ తర్వాత ఆమెపై పెట్రోల్‌తో దాడి చేసి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో లాడ్జి సిబ్బంది పోలీసుల సహకారంతో ఆస్పత్రికి తరలించగా నిందితుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే హన్మకొండకు చెందిన యువకుడు హర్షవర్ధన్ రెడ్డి, విశాఖకు చెందిన బాధిత యువతి పంజాబ్‌లో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ఈ క్రమంలో యువకుడు ఈనెల […]</p>

దిశ, ఏపీబ్యూరో: విశాఖలో సంచలనం సృష్టించిన ప్రేమోన్మాది, చికిత్సపొందుతూ మృతి చెందాడు. మాట్లాడుకుందామని స్నేహితురాలిని లాడ్డికి పిలిచి.. ఆ తర్వాత ఆమెపై పెట్రోల్‌తో దాడి చేసి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో లాడ్జి సిబ్బంది పోలీసుల సహకారంతో ఆస్పత్రికి తరలించగా నిందితుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే హన్మకొండకు చెందిన యువకుడు హర్షవర్ధన్ రెడ్డి, విశాఖకు చెందిన బాధిత యువతి పంజాబ్‌లో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ఈ క్రమంలో యువకుడు ఈనెల 13న హర్షవర్థన్ రెడ్డి విశాఖపట్నం వచ్చాడు.
యువతిని మాట్లాడే పనుందని శ్రీ రాఘవేంద్ర లాడ్జికి పిలిచాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే పెట్రోల్ వెంట తెచ్చుకున్న హర్షవర్థన్ రెడ్డి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం హర్ష వర్థన్ రెడ్డి సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు బాధితులిద్దరినీ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న హర్షవర్థన్ మంగళవారం ఉదయం మరణించాడు. అయితే ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది.






